VIDEO: చిన్నారుల కిడ్నాపింగ్ కేసు ఇద్దరు నిందితులు అరెస్ట్
వరంగల్ నగరంలో చిన్న పిల్లల కిడ్నాపింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఇవాళ అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదుగురు చిన్నారులతో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.