అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

VSP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు రైలుపట్టాలపై అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం విశాఖ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ఆదివారం ఇంట్లోకి కూరగాయలు తెస్తానని చెప్పి వెళ్లిన ఆయన రైలుపట్టాలపై  విగతజీవిగా పడి ఉన్నట్లు  రైల్వేపోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGHకు తరలించారు.