నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

GNTR: రహదారి విస్తరణ, విద్యుత్ లైన్ల పునరుద్దరణ కోసం శనివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురవయ్య తెలిపారు. పట్టాభిపురం, లక్ష్మీపురం, రామన్నపేట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.