కారు బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు
MLG: తాడ్వాయి మండలం అంకంపల్లి బస్టాండ్ సమీపంలోని మూలమలుపు వద్ద శనివారం రాత్రి మణుగూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.