ఈనెల 24 నుంచి జెండా జాతర ఉత్సవాలు

KMR: నగరంలోని జెండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభమవుతున్నట్లు వంశపారపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి తెలిపారు. ఇందులో భాగంగా బాలాజీ జెండా శోభాయాత్ర నగరంలోని పెద్ద బజార్లోని తమ స్వగృహం నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఆలయంలో జెండాను ప్రతిష్టించిన అనంతరం 15 రోజుల పాటు నిత్య పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.