VIDEO: వైసీపీ నేతపై దాడి.. మాజీ ఎమ్మెల్యే ఫైర్
PLD: నరసరావుపేటలో గంజాయి ముఠాలు, టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు షేక్ హన్నుపై అర్ధరాత్రి దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో ఉన్న బాధితుడిని గోపిరెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీని ఆయన కోరినట్లు వెల్లడించారు.