పార్టీ బలోపేతానికి శ్రమించాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
E.G: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఆనంద్ ఏజెన్సీహోటల్‌లో రాజమండ్రి అర్బన్ టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.