పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

KMR: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, సిబ్బంది విధులను పరిశీలించి, వివిధ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డయల్-100 కాల్స్‌కు స్పందించాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గ్రామాలలో పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు.