టీడీపీ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం

ELR: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.