మందుబాబులకు అడ్డాగా మారిన మార్కెట్ యార్డ్

మందుబాబులకు అడ్డాగా మారిన మార్కెట్ యార్డ్

KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్ ఇప్పుడు వ్యాపారానికి కాకుండా మందుబాబులకు అడ్డాగా మారిపోయిందని స్థానికులన్నారు. ప్రతిరోజూ పట్టపగలు గుంపులుగా చేరి అక్కడే మద్యం తాగుతున్నట్లు తెలిపారు. ఖాళీ బ్రాందీ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు యార్డ్‌లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయని, ఈ సమస్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాని స్థానికులు కోరారు.