దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే
ADB: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా, MLA పాయల్ శంకర్‌తో కలిసి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన నాయకుడని కొనియాడారు.