‘నా కుమారుడి పేరు శేఖర్ అని అందుకే పెట్టా’
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర విషయం బయటపెట్టారు. తన పార్ట్నర్ షివాన్ సగం ఇండియన్ అని, అందుకే తన కుమారుడి మిడిల్ నేమ్ 'శేఖర్' అని పెట్టానని తెలిపారు. ప్రముఖ భారతీయ ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ స్ఫూర్తితోనే ఈ పేరు పెట్టినట్లు మస్క్ రివీల్ చేశారు. ఇండియా అన్నా, ఇక్కడి మేధావులన్నా తనకెంత ఇష్టమో మస్క్ ఇలా చాటుకున్నారు.