VIDEO: జనవరి 25న జిల్లాలో 10K వాక్ కార్యక్రమం: ఆలపాటి
గుంటూరు నగరంలో వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన 10K వాక్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 'ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక' అనే నినాదంతో ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.