VIDEO: వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

VIDEO: వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

కృష్ణా: గుడివాడ మండలం వలివర్తిపాడు గ్రామం అరుంధతి కాలనీలో ఒక గృహంలో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు గుడివాడ రూరల్ ఎస్సై చంటిబాబు పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం రైడ్ చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను గుడివాడ కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ముద్దాయిలను 14 రోజులు రిమాండ్ విధించింది.