రాజోలులో వైసీపీని బలోపేతం చేస్తా: పాముల

రాజోలులో వైసీపీని బలోపేతం చేస్తా: పాముల

కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేస్తానని వైసీపీ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి అన్నారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.