'బురద రోడ్డు వల్ల రాకపోకలు కష్టసాధ్యం'
VZM: బొండపల్లి మండలం చినగూడెం గ్రామంలో సరైన రహదారి లేక ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బురదమయమైన రోడ్డులో నిరసన తెలిపారు. గ్రామం నుంచి గొల్లుపాలెం వరకు రహదారి పూర్తిగా బురదతో నిండి ఉండటంతో పిల్లలు పాఠశాలలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో గిరిబాల తెలిపారు.