'ఆయన మృతి పార్టీకి తీరని లోటు'

CTR: నగరి రూరల్‌కు చెందిన వైసీపీ మాజీ మండల కన్వీనర్ సుదర్శన్ నాయుడు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి రోజా మేలపట్టు గ్రామానికి వెళ్లి సుదర్శన్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.