ప్రశంసా పత్రం అందుకున్న వీఆర్ఏ

ELR: జీలుగుమిల్లి మండల రెవెన్యూ కార్యాలయ వీఆర్ఏ షరీఫ్ జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రజా సేవలో నిజాయితీ, కృషి, అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు అందరికీ ఆదర్శమన్నారు. స్థానికులు షరీఫ్ సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.