వర్షానికి కొట్టుకుపోయిన మారిక రోడ్డు

VZM: వేపాడ మండలంలో ఇటీవల వేసిన మారిక తారు రోడ్డు వేసిన వెంటనే కొట్టుకుపోవడంతో కాంట్రాక్టర్లు అధికారులు చేసిన అవినీతి వరదలో మారిక రోడ్డు కొట్టుకుపోయిందని సీపీఎం నాయకుడు చల్లా జగన్ ఆరోపించారు. రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీరింగ్ అధికారులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.