కెమిస్ట్రీ విభాగాధిపతికి ప్రొఫెసర్‌గా పదోన్నతి
WGL: సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఉన్నత విద్య కళాశాల కమిషనర్ దేవసేన నేడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేడీసీలో కెమిస్ట్రీ విభాగాధిపతిగా, పీజీ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ గుర్రం శ్రీనివాస్, అధ్యాపక బృందం, పలువురు గ్రామస్థులు శ్రీనివాసును అభినందించారు.