ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజులుగా కొనసాగుతున్న 8 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్ తెలిపారు.