జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం అండ: మంత్రి

NGKL: జర్నలిస్ట్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సోమశిలలో ఏప్రిల్ 21న జరిగిన TUWJ(IJU) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం విజయవంతం అయ్యేందుకు సహకరించిన మంత్రిని జర్నలిస్ట్‌లు ఇవాళ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించి మెమొంటోను అందజేశారు. విలువలతో కూడిన వార్తలు రాయాలని మంత్రి సూచించారు.