కబడ్డీ ఉచిత కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ గ్రౌండ్‌లో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో, ఈ రోజు నుండి ఉచితంగా కబడ్డీ కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.