బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
KRNL: తుగ్గలి మండలంలోని లింగనేమిదొడ్డి గ్రామంలో తిమ్మగురు స్వామి, మునిరంగ స్వామి ఉత్సవాల జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను గురువారం ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ ప్రారంభించారు. ఆయన ముందుగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర, వెంకటపతి, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.