వేసవి సెలవుల్లో జాగ్రత్తలు పాటించాలి: ఎస్సై
VKB: వేసవి సెలవుల సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై విమల సూచించారు. చోరీలు నివారించేందుకు పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే చిన్నారులు చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని హెచ్చరించారు.