19న ఉచిత మెగా దంతవైద్య శిబిరం
ATP: పామిడి పట్టణ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఈ నెల 19వ తేదీన ఉచిత మెగా దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లపాటి తిరుపతినాయుడు, అధ్య క్షుడు కె.రఘువీరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ దీర్ఘకాలిక దంత సమస్యలకు ఉచిత పరీక్షలతో పాటు మందులు, టూత్ పేస్టులు, బ్రష్‌లు ఇస్తారన్నారు.