రెండు బైక్ లు ఢీకొని.... ఇద్దరికీ తీవ్ర గాయాలు

SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన సుధాకర్ ద్విచక్ర వాహనంపై తిరుమలగిరికి వస్తుండగా వెలిశాల వైపు వెళ్తున్న గుగులోతు యాకయ్య ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.