గ్రంథాలయాల వారోత్సవాల్లో ఫాల్గొన్న ఎంపీ, కలెక్టర్
మెదక్ జిల్లా గ్రంథాలయంలో 58వ వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాధవ నేని రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ ఛైర్మన్ సుహాసిని రెడ్డిలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రంథాలయాలు అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు.