ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
MHBD: గూడూరు మండల కేంద్రంలోని కలకత్తా తండాలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు స్థానిక కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. లబ్ధిదారులు వాంకుడోత్ నాగమణి లింగన్న, జ్యోతి శంకర్ దంపతులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు పత్రాలు అందజేసి, గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మాలు, శ్రీపాల్ రెడ్డి, చంటి స్వామి, రసూల్ తదితరులు పాల్గొన్నారు.