'వైర్లను తొలగించడంలో అలసత్వం వహించవద్దు'

HYD: విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. HYDలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కేబుల్ వైర్లను తొలగించడంలో ఎలాంటి ఆలసత్వం వహించవద్దని సూచించారు.