ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
MHBD: గార్ల మండల కేంద్రంలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి మండలం మంగళ్‌తండాకు చెందిన తేజావత్ నాగేందర్ (35) మొక్కజొన్న తరలించి ఇంటికి తిరిగి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో నాగేందర్ తీవ్ర గాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.