ఆకివీడులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

W.G: ఆకివీడు స్థానిక సిద్దాపురం రోడ్లో ఉన్న దాసరి శ్రీనివాస్ సంబంధించిన ఓ షాప్‌లో అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారంతో విజిలెన్స్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. మూడు టన్నులు అక్రమ బియ్యం ఉన్నట్లు గుర్తించి వెంటనే వాటిని సీజ్ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ ఆఫీసర్ మిరయ్య, డీటీ మహేశ్వరావు, వీఆర్వో సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.