VIDEO: 'బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేయొద్దు'
RR: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ వార్డులో మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పరిశుభ్రతను కాపాడుకోవడం సమాజ బాధ్యత అని, యజమానులు తమ ప్రాంగణాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను వేయకుండా ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్యం, వ్యర్ధాల నిర్వహణపై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.