రామాపురం వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించిన ఆర్డీవో

PLD: దాచేపల్లి మండలం రామాపురం వద్ద కృష్ణానది వరద ఉద్ధృతిని గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, దాచేపల్లి తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ గురువారం పరిశీలించారు. నాగార్జునసాగర్ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ సూచించారు. మత్స్యకారుల కాలనీలోకి వరద నీరు చేరితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.