VIDEO: హనుమాన్ దీక్షను స్వీకరించిన భక్తులు
MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 530 మంది భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. రానున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నుంచి వందలాది మంది భక్తులు గూడెం గుట్ట దేవాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ అనుబంధ హనుమాన్ దేవాలయంలో 530 మంది భక్తులు వేద పండితుల సమక్షంలో హనుమాన్ మాల ధారణ దీక్షను స్వీకరించారు.