VIDEO: నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం
HYD: నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్ PS ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ భవనంలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ కాలిపోవడంతో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. ప్రమాదానికి గురైన భవనం NH-65 పక్కనే ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.