TVలోకి వచ్చేస్తోన్న తిరువీర్ మూవీ
నటుడు తిరువీర్, టీనా శ్రావ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ TV ఛానల్ జీ తెలుగులో ఈ నెల 14న సాయంత్రం 6:30 గంటలకు టెలికాస్ట్ కానుంది. కాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే ప్యూర్ కామెడీ కథాంశంతో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు.