అలుగుపై ఉన్న మట్టిని తొలగించాలని వినతి

అలుగుపై ఉన్న మట్టిని తొలగించాలని వినతి

KMR: ఎల్లారెడ్డి మండలంలోని వెంకపూర్ గ్రామ శివారులో ఉన్న నర్వ చెరువు అలుగుపై ఉన్న మట్టిని తొలగించాలని గ్రామస్తులు ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అలుగుపై అదనంగా పోయడం వల్ల నీటిమట్టం పెరిగి పంట పొలాలు మునుగుతున్నాయని, అలుగుపై అదనంగా పోసిన మట్టిని తొలగించాలని కోరారు.