ఆకాశంలో విందు వికటించింది.. గాల్లోనే నరకం!

ఆకాశంలో విందు వికటించింది.. గాల్లోనే నరకం!

కేరళలోని మున్నార్‌లో స్కై డైనింగ్ రెస్టారెంట్ వద్ద కలకలం రేగింది. ఇడుక్కి జిల్లా అనచల్‌లో టెక్నికల్ సమస్యతో క్రేన్ మొరాయించడంతో.. పర్యాటకులు, సిబ్బంది గాల్లోనే చిక్కుకుపోయారు. దాదాపు గంటన్నర సేపు వారు ఆకాశంలోనే వేలాడుతూ ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అందరినీ సురక్షితంగా కిందకు దించేశారు.