హోంగార్డును సత్కరించిన ఎమ్మెల్యే కన్నా
పల్నాడు: ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్‌లో హోంగార్డు సుభాని గత 26 సంవత్సరాలుగా వేసవికాలంలో మంచినీటి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే చలివేంద్రాన్ని నిర్వహించడం మంచి విషయమని హోంగార్డు సుభానిని ఎమ్మెల్యే కన్నా సత్కరించారు.