సీతారామచంద్ర స్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే
బాపట్ల మండలం బేతపూడిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్, వైసీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామస్తులు, భక్తులతో కలిసి ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.