సామ్రాజ్యవాద దోపిడిని అరికట్టాలి: మంగీలాల్

వరంగల్: సామ్రాజ్యవాద దోపిడిని అరికట్టాలని పివైఎల్ మండల కార్యదర్శి మంగీలాల్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గార్లలో భగత్ సింగ్ వర్ధంతికి సంబంధించిన పోస్టర్లను నేతలతో కలిసి మంగీలాల్ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.