ఈనెల 19న పోలేపల్లిలో ఉచిత వైద్య శిబిరం..

NLG: చందంపేట మండలం పోలేపల్లిలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈనెల 19న(శనివారం) ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చందంపేట ఎస్సై సతీష్ తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న నిష్ణాతులైన డాక్టర్లచే పరీక్షలు జరిపి చికిత్స చేయనున్నట్లు తెలిపారు.