తెనాలిలో వృద్ధుడిపై వీధి కుక్కల దాడి
GNTR: తెనాలిలోని అమరావతి కాలనీకి చెందిన మోహనరావు అనే వృద్ధుడిపై శుక్రవారం వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి వద్ద నడిచి వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన కుక్కలు దాడిచేసి కరవడంతో ఆయన కాలిపై 2 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వ్యాక్సిన్ వేయించారు.