కేంద్ర పోలీసు బలగాల కోసం ఉమ్మడి చట్టం
కేంద్ర సాయుధ పోలీసు బలగాల(CAPF) కోసం కేంద్రమంత్రి అమిత్ షా రేపు రాజ్యసభలో ఉమ్మడి చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ దళాల్లోని అధికారుల నియామకం, డిప్యూటేషన్, పదోన్నతి, సర్వీసుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. CAPFలో CRPF, BSF, ITBP, SSB ఉంటాయి. వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. తాజాగా తెచ్చే CAPF బిల్లు-2026లో ఈ బలగాల్లో IPS అధికారుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఉంటాయి.