ఘనంగా ప్రారంభమైన జెండా జాతర

NZB: నగరంలోని జెండా బాలాజీ ఆలయ జెండా ఊరేగింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఆలయ వంశపారపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి స్వగృహం పెద్ద బజారు నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాజులపేట వరకు వెళ్లి తిరిగి బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వంశపారపర్య అర్చకులు విజయ్ సాంగ్వాయ్ పాల్గొన్నారు.