నొప్పులు లేని ప్రసవం.. మంత్రికి కవిత విజ్ఞప్తి

నొప్పులు లేని ప్రసవం.. మంత్రికి కవిత విజ్ఞప్తి

TG: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా పాత పద్ధతుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవడానికి ఉపయోగించే 'ఎపిడ్యూరల్' అనే మెడిసిన్‌ను ఇవ్వాలని కోరారు. తద్వారా గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో పడే బాధను తగ్గించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.