ఘనంగా భద్రేశ్వరుని పల్లకి సేవ

ఘనంగా భద్రేశ్వరుని పల్లకి సేవ

VKB: తాండూర్ పట్టణంలో భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నిన్న రాత్రి ఘనంగా జరిపారు. మూడో రోజు సందర్భంగా పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తూ భజన కార్యక్రమాలతో భక్తి వాతావరణం నెలకొల్పారు. శనివారం రథోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.