అన్న క్యాంటీన్‌ను సందర్శించిన కమిషనర్

అన్న క్యాంటీన్‌ను సందర్శించిన కమిషనర్

GNTR: తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి మంగళవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.