రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
W.G: నల్లజర్ల మండలంలోని అనంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా సూచిక బోర్డును కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులు చాపల రాజు, చాపర్ల హనుమంతరావు, సాగర్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.